బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్‌లో 500నిట్ల పీక్ బ్రైట్‌నెస్‌తో1.69-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. RGB కలర్ గామట్ 70 శాతం ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ హార్ట్ బీట్ రేటును నిరంతరం పర్యవేక్షించగలదు. నిద్ర, SpO2ని కూడా ట్రాక్ చేస్తుంది. ఫుట్‌బాల్, యోగా, సైక్లింగ్, వాకింగ్, బ్యాడ్మింటన్, వాకింగ్, రన్నింగ్, బాస్కెట్‌బాల్, స్కిప్పింగ్, క్లైంబింగ్, స్విమ్మింగ్ వంటి 10 స్పోర్ట్స్ మోడ్స్‌లో అందుబాటులో ఉంది. దీన్ని రూ. 1999కు సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ 240x280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.69-అంగుళాల TFT డిస్ప్లేతో లాంచ్ అయింది. పిక్సెల్ డెన్సిటీ 218ppiతో 500 నిట్ల పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది. అంతేకాకుండా 60 ప్రీసెట్ స్పోర్ట్స్ మోడ్స్, 150+ వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్‌తో మీ హృదయ స్పందన రేటును ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 1499 మాత్రమే.
బౌల్ట్ కాస్మిక్ స్మార్ట్ వాచ్ 1.69-అంగుళాల TFT డిస్ప్లేతో ఉంటుంది. 240x280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 218ppi పిక్సెల్ డెన్సిటీ, 500 నిట్స్ హై బ్రైట్నెస్ డిస్ప్లే, 100+ వాచ్ ఫేస్‌లతో లాంచ్ అయింది. హెల్త్ సంబంధించిన అనేక ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. బ్లడ్ ప్రెజర్ మానిటర్, బ్లడ్ శాచురేషన్ ట్రాకర్ కూడా ఇందులో ఉన్నాయి. హార్ట్ బీట్, ఋతు చక్రం వంటి వాటిని ట్రాకింగ్ చేస్తూ కచ్చితమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. వాటర్ రెసిస్టెంట్‌తో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్‌లో లభిస్తుంది. కేలరీలు, స్టెప్స్ కౌంట్ కోసం ఇందులో అధునాతన HR సెన్సార్లను అమర్చారు. దీన్ని రూ.1999కు సొంతం చేసుకోవచ్చు.