గ్రహశకలాలతో భూమికి ఎప్పుడూ ముప్పే. తరచూ అవి భూమివైపు వస్తూనే ఉన్నాయి. లక్కీగా వాటిలో ఏవీ భూమి ఢీకొట్టట్లేదు. ఆ లిస్టులో మరొకటి చేరుతోంది. లండన్ లోని బిగ్ బెన్ సైజులో ఉన్న ఓ భారీ గ్రహశకలం ఇవాళ భూమికి దగ్గరగా వస్తుంది. షాకింగ్ విషయమేంటంటే... ఇది చందమామ కంటే దగ్గరగా వస్తోంది. అంటే.. భూ కక్ష్య నుంచి ఈ గ్రహశకలం వెళ్లబోతోంది. ఇదే ఆందోళన కలిగించే విషయం.
ఇవాళ వచ్చే గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవు. కానీ.. దగ్గరగా వస్తోంది కాబట్టి దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి గ్రహశకలాల్ని అంతరిక్షంలోనే పేల్చి వేసే టెక్నాలజీని మనం మరింతగా డెవలప్ చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్రెడీ ఆమధ్య నాసా ఓ చిన్న గ్రహశకలాన్ని విడయవంతంగా పేల్చివేసింది.
ఈ గ్రహశకలాన్ని ఫిబ్రవరి 27న తొలిసారిగా కనిపెట్టారు. యూరోపియన్ నియర్ ఎర్త్ ఆస్ట్రరాయిడ్స్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా దీన్ని గుర్తించారు. ఆ సమయంలో అది భూమికి 159 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి 3.16 సంవత్సరాలు పడుతుందని అంచనా. ఈ గ్రహశకలం మళ్లీ 2026లో భూమికి దగ్గరగా రానుంది. అప్పుడు గనుక ఢీకొట్టకపోతే.. 2029లో భూమికి మరింత దగ్గరగా వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.