గతేడాది 9వ స్థానంలో నిలిచిన ధోని సేన.. ఈ ఏడాది బౌన్స్ బ్యాక్ అవుతుందని అంతా భావించారు. అయితే తొలి గేమ్ లోనే తన బలహీనతలను బయటపెట్టేసింది. బ్యాటింగ్ లో రుతురాజ్ మినహా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. ఇక బౌలింగ్ లో అయితే చెన్నై చాలా బలహీనంగా కనిపిస్తోంది.