ఇక, క్రికెట్ (Cricket)లో ఈ ఏడాది నమోదైన రికార్డుల గురించి అభిమానులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. ఆటగాళ్ల వారిగా రికార్డులను వారు చేసిన పరుగులను లెక్కకడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డులను, వారు చేసిన పరుగులను లెక్కలు వేస్తున్నారు.
ఈ ఏడాది టెస్టుల్లో 21 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్ 47 సగటుతో 906 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా ఓ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది టెస్టుల్లో ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేయడం ద్వారా విదేశాల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
2021లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చేసిన పరుగులను లెక్కలోకి తీసుకోని కొందరు అభిమానులు ఒకరితో ఒకరిని పోలుస్తున్నారు. ఈ ఏడాది రోహిత్ శర్మ సూపర్ హిట్ అని, విరాట్ కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అని సెటైర్లు వేస్తున్నారు. అటు విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కూడా అచ్చిరాలేదు. ఈ సారి కూడా ఆర్సీబీ టైటిల్ నెగ్గలేదు. దీంతో, ఆర్సీబీ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు విరాట్.