రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపన్ తన రేసింగ్ కారు చక్రాన్ని కాలితో తన్నుతున్న దృశ్యం. బాకు సిటీలో జరిగిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ రేసులో కారు క్రాష్ అవడంతో కోపంతో ఇలా ఊగిపోయాడు. విశేషం ఏంటంటే ఈ ఏడాది ఫార్ములా వన్ టైటిల్ మ్యాక్స్ గెలచుకున్నాడు. 2021 జూన్ 6న ఈ సంఘటన జరిగింది. (Image: REUTERS/Anton Vaganov)
ఈ ఫొటో ఈ ఏటి మేటి చిత్రంగా అభివర్ణించవచ్చు. బల్గేరియాలోని వర్నా నగరంలో ది ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ స్పోర్ట్స్ వేదికగా రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలు జరిగాయి. అందులో ఇజ్రాయేల్ జిమ్నాస్ట్ లినోయ్ ఆశ్రమ్ ఇండివిడ్యువల్ బాల్ ఈవెంట్లో విన్యాసం చేసే సమయంలో తల స్థానంలో బాల్‌ను అద్భుతంగా బంధించాడు. 2021 జూన్ 12న ఈ ఫొటో తీశారు. (Image: REUTERS/Spasiyana Sergieva)