Year Ender 2021: ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్లు వీళ్లే..
Year Ender 2021: ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్లు వీళ్లే..
Year Ender 2021: ఏ వయసులో తీరాల్సిన ముచ్చట.. ఆ వయసులో తీరాలంటారు పెద్దలు. పెళ్లి కూడా అంతే. అందుకే మన క్రీడాకారుల్లో కొంత మంది ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కేశారు. వారెవరో ఓ లుక్కేద్దాం.
కరోనా నిబంధనల వల్ల రెండు సార్లు పెళ్లి వాయిదా వేసుకున్న ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. చివరికి తన ప్రేయసి హాతీని ఈ ఏడాది జూన్ 21 న వివాహం చేసుకున్నాడు. న్యూ సౌత్ వేల్స్ లో ఈ ఇద్దరి వివాహం జరిగింది.
2/ 9
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రేయసి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ ను మార్చి 15 న వివాహమాడాడు. అత్యంత గోప్యంగా కొద్ది మంది అతిథుల సమక్షంలో గోవాలో వీరి పెళ్లి జరిగింది.
3/ 9
భారత క్రికెటర్ జయదేవ్ ఉనాద్కత్ కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన జైదేవ్ రిన్నీని ఫిబ్రవరి 2 న గుజరాత్ లో వివాహమాడాడు.
4/ 9
టీమిండియా ఆల్ రౌండర్ జయంత్ యాదవ్ తన గర్ల్ ఫ్రెండ్ ను దిశా చావ్లాను ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 16న జరిగింది.
5/ 9
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఎన్నో వీరోచిత ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్ తేవటియా కూడా ఓ ఇంటివాడయ్యాడు. రిద్ది పన్నును ఈ ఏడాది నవంబర్ 29 న వివాహమాడాడు. ఫిబ్రవరిలో ఈ జంట నిశ్చితార్ధం జరిగింది.
6/ 9
పుదేచ్చేరి డొమెస్టిక్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ దామోదరన్ ఐశ్వర్యను జూన్ 27న పెళ్లి చేసుకున్నాడు. ఐశ్వర్య ఫేమస్ డైరక్టర్ శంకర్ కూతురు.
7/ 9
టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా ఈ ఏడాది పెళ్లి చేసుకున్నాడు. తన చిరకాల ప్రేయసి అంజుమ్ ఖాన్ ను ఈ ఏడాది జూలై 16 న వివాహమాడాడు.
8/ 9
టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా వైశాలీ విశ్వేశ్వరన్ ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి పెళ్లి ఈ ఏడాది జనవరిలో జరిగింది.
9/ 9
టీమిండియా ఆటగాడు.. సన్రైజర్స్ హైదరబాద్ బౌలర్ సందీప్ శర్మ కూడా ఈ ఏడాది ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆగష్టులో వీరిద్దరి వివాహం జరిగింది.