WWE స్టార్ జాన్ సీనా ఏంటి ఇలా మారిపోయాడు! ఆ డ్రెస్ ఏంటయ్యా బాబు!
WWE స్టార్ జాన్ సీనా ఏంటి ఇలా మారిపోయాడు! ఆ డ్రెస్ ఏంటయ్యా బాబు!
John Cena - WWE : ఇక డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి జాన్ సీనా పరిచయం అక్కర్లేని పేరు. తన రెజ్లింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిన దిగ్గజం.. మరో మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు.
ఇండియా (India)లో డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ రెజ్లింగ్ షోను దేశంలోని యువత కళ్లప్పిగించి మరీ చూస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ షోకి ఫ్యాన్స్ ఉన్నారు. (PC : WWE)
2/ 7
ఇక డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి జాన్ సీనా పరిచయం అక్కర్లేని పేరు. తన రెజ్లింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 13సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిన దిగ్గజం.. మరో మూడుసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. (PC : TWITTER)
3/ 7
తన పిడిగుద్దులతో పాటు మైక్ స్కిల్స్ తో జాన్ సీనా అతి తక్కువ కాలంలోనే డబ్ల్యూడబ్ల్యూఈకి ముఖ చిత్రంగా మారిపోయాడు. ఎప్పుడూ ఫేస్ రోల్ (హీరో)లో ఉండే మనోడికి ఒకప్పుడు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. (PC : TWITTER)
4/ 7
డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా వచ్చిన స్టార్ డబ్ తో జాన్ సీనా సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. ఇప్పటికే పలు మూవీస్ లో కూడా నటించాడు. దాంతో జాన్ సీనా కొంతకాలంగా రెజ్లింగ్‌కు దూరమయ్యాడు. తాజాగా రెజిల్ మేనియాతో మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. (PC : TWITTER)
5/ 7
అయితే తాజాగా జాన్ సీనాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3/4 షాట్స్ తో కనిపించే జాన్ సీనా.. అమ్మాయిలా వేషం వేశాడు. స్కర్ట్, హై హీల్స్ చెప్పులతో పాటు లిప్ స్టిక్ వేసుకుని కనిపించాడు. (PC : TWITTER)
6/ 7
ప్రస్తుతం అతడి గెటప్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఏమైందంటూ అతడి అభిమానులు కంగారు కూడా పడ్డారు. ఇదేం కర్మరా బాబు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. (PC : TWITTER)
7/ 7
అయితే జాన్ సీనా ఇలా మారడానికి ఒక కారణం ఉంది. ప్రస్తుతం అతడు హాలీవుడ్ మూవీ 'రికీ స్టానికి'లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో భాగంగా జాన్ సీనా విచిత్రమైన గెటప్ వేసినట్లు తెలుస్తోంది. (PC : TWITTER)