గతంతో పోలీస్తే సౌతాఫ్రికా టీమ్ చాలా బలహీనంగా ఉంది. దీంతో.. ఈ సారి టీమిండియా పని సులువు అవుతోందని అందరు భావించారు. కానీ.. చెత్త బ్యాటింగ్, పేలవ ఫీల్డింగ్‌తో విజయాన్ని చేజార్చుకుంది. పదే పదే ఆఫ్ సైడ్ బంతుల్ని వెంటాడీ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. బౌలర్లు మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఇక, ఫీల్డింగ్ లోనూ నిరాశపర్చింది కోహ్లీసేన.
మరోవైపు సౌతాఫ్రికాకు ఇదే మొదటి సిరీస్ కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆడి రెండింటిలో గెలిచింది. ఆ జట్టు గెలుపు శాతం 66.66. దాంతో.. భారత్ కంటే మెరుగైన ర్యాంక్‌ను సౌతాఫ్రికా చేజిక్కించుకుంది. కానీ.. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి 24 పాయింట్లే. ఐసీసీ 2020 నుంచి పాయింట్ల ఆధారంగా కాకుండా గెలుపు శాతం ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తున్న విషయం తెలిసిందే.