WTC Final ఓడిన టీమిండియాకు మరో టెన్షన్..కీలక ఆటగాడికి గాయం..

WTC Final : ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కివీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఎప్పుట్నుంచో ఊరిస్తోన్న ఐసీసీ టైటిల్ ను మొదటి సారి ముద్దాడింది న్యూజిల్యాండ్ టీమ్. ఎన్నో అంచనాల మధ్య దిగిన కోహ్లీసేన పరాభవం తప్పలేదు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిన భారత్ జట్టుకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కీలక ఆటగాడు గాయపడ్డాడు. దీంతో టీమిండియా శిబిరంలో టెన్షన్ మొదలైంది.