ఇక శ్రీలంక, కివీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు థ్రిల్లర్ సినిమాను తలపించింది. చివరి వరకు ఇరు జట్లను విజయం దోబూచులాడింది. 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఒక దశలో ఓటమి అంచున నిలిచింది. అయితే కేన్ విలియమ్సన్ (121 నాటౌట్) అజేయ శతకంతో చివరి వరకు నిలిచి కివీస్ కు గొప్ప విజయాన్ని అందించాడు.
ఇప్పటి వరకు వన్డే, టి20ల్లో మాత్రమే ఆఖరి బంతికి గెలవడం చూస్తుంటాం. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కివీస్ ఆఖరి బంతికి నెగ్గింది. ఆఖరి బంతికి కివీస్ నెగ్గాలంటే ఒక పరుగు చేయాల్సి ఉంది. అశిత ఫెర్నాండో బౌన్సర్ వేయగా.. విలియమ్సన్ దానిని ఆడలేకపోయాడు. దాంతో బంతి కాస్తా వికెట్ కీపర్ చేతిలోకి వెళ్లింది. (PC : Screen Short/Youtube)
అదే సమయంలో కేన్ విలియమ్సన్ పరుగు కోసం ప్రయత్నించాడు. వికెట్ కీపర్ స్ట్రయికింగ్ ఎండ్ వైపు వికెట్లను గిరాటేయడంలో విఫలం అయ్యాడు. బంతి బౌలర్ చేతికి చిక్కగా.. క్షణం కూడా లేట్ చేయకుండా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వికెట్లను డైరెక్ట్ త్రోతో పడగొట్టేశాడు. అదే సమయంలో రనౌట్ కాకూడదని కేన్ విలియమ్సన్ డైవ్ చేశాడు. (PC : Screen Short/Youtube)
దాంతో కివీస్ శ్రీలంకపై 2 వికెట్ల తేడాతో నెగ్గి.. టెస్టు సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఓడటంతో ఈ సిరీస్ ను గెలిచే అవకాశం శ్రీలంకకు లేదు. రెండో టెస్టులో శ్రీలంక నెగ్గినా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించదు. ఈ నేపథ్యంలో సూపర్ డైవ్ తో అటు తన జట్టుతో పాటు టీమిండియాను గెలిపించిన కేన్ మామ.. భారత అభిమానుల దృష్టిలో హీరో అయ్యాడు.