WTC Final : వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్.. మరి టీమిండియా కథేంటి? లెక్కలు ఇవే!
WTC Final : వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆసీస్.. మరి టీమిండియా కథేంటి? లెక్కలు ఇవే!
WTC Final 2023 : అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో విశేషంగా రాణించిన ఆస్ట్రేలియా భారత్ పై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. లంచ్ విరామానికంటే ముందు ఛేదించి విజయాన్ని అందుకుంది.
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Tropy 2023)లో టీమిండియా (Team India) జోరుకు కళ్లెం పడింది. తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా (Australia) మూడో టెస్టులో బౌన్స్ బ్యాక్ అయ్యింది.
2/ 8
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో విశేషంగా రాణించిన ఆస్ట్రేలియా భారత్ పై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆసీస్.. లంచ్ విరామానికంటే ముందు ఛేదించి విజయాన్ని అందుకుంది.
3/ 8
ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది.
4/ 8
మూడో టెస్టులో ఓడటంతో భారత్ ఫైనల్ ఛాన్స్ కు బ్రేక్ పడింది. అయితే ఫైనల్ దారులు మాత్రం మూసుకుపోలేదు. భారత్ నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరిదైన నాలుగో టెస్టులో తప్పక నెగ్గాలి.
5/ 8
అప్పుడే న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ నాలుగో టెస్టులో భారత్ ఓడినా.. లేక డ్రా చేసుకున్నా అప్పుడు శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది.
6/ 8
అటువంటి సమయంలో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కివీస్ పై శ్రీలంక నెగ్గితే మాత్రం అప్పుడు ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరుకుంటుంది.
7/ 8
ఒక శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ డ్రాగా ముగిసినా.. కివీస్ సిరీస్ ను గెలిచినా అప్పుడు భారత్, ఆసీస్ జట్లు ఫైనల్లో ఆడతాయి. అసలు కివీస్, శ్రీలంక సిరీస్ తో సంబంధం లేకుండా ఫైనల్ కు చేరాలంటే మాత్రం నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించాల్సి ఉంది.
8/ 8
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టు ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 9.30లకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.