ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ (India Vs England)లో టీమిండియా (Team India) 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ చెలరేగితే.. ఇంగ్లండ్ విఫలమైంది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.