ముంబై (Mumbai) వేదికగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL Auction 2023) వేలం ముగిసింది. 90 స్థానాలకు కోసం 409 మంది క్రికెటర్లు వేలంలోకి రాగా.. ఐదు ఫ్రాంచైజీలు కలిసి 87 మందిని కొనుగోలు చేసింది. టీమిండియా (Team India) స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana)ను అత్యధికంగా రూ. 3.40 కోట్ల ధర పలికింది. ఆమెను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) సొంతం చేసుకుంది. (PC : TWITTER)
ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డ్ నర్ ను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్.. అంతే మొత్తానికి ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్ ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. జెమీమా రోడ్రింగ్స్ (రూ.2.2 కోట్లు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లకు) ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. (PC : TWITTER)
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అంజలి శర్వాణిని రూ. 55 లక్షలకు యూపీ వారియర్జ్ సొంతం చేసుకుంది. ఈమె కోసం గుజరాత్ జెయింట్స్ కూడా తీవ్రంగా ప్రయత్నంచింది. అయితే చివరకు యూపీయే సొంతం చేసుకుంది. లెఫ్టార్మ్ పేసర్ అయిన శర్వాణి ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచకప్ లో టీమిండియా జట్టులో భాగంగా ఉంది. (PC : TWITTER)
వైజాగ్ కు చెందిన స్నేహ దీప్తిని రూ. 30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మొదట ఆన్ సోల్డ్ గా నిలిచిన స్నేహను వేలం చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం స్నేహ వయసు 26 ఏళ్లు మార్చిలో జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాణిస్తే టీమిండియా తరఫున మళ్లీ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. 16 ఏళ్ల 204 రోజులకే టీమిండియా తరఫున టి20ల్లో అరంగేట్రం చేసిన ఘనత స్నేహ దీప్తికే దక్కుతుంది. (PC : Sneha Deepthi/Instagram)
విశాఖపట్నంకు చెందిన షబ్నమ్ షకీల్ పేస్ బౌలర్. ఈమెను గుజరాత్ జెయింట్స్ రూ. 10 లక్షలకు సొంతం చేసుకుంది. తద్వారా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడనున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది.ఈమె వయసు 15 ఏళ్లు. ఇటీవలె ముగిసిన అండర్ 19 మహిళల టి20 ప్రపంచకప్ లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాలో భాగంగా ఉంది. (PC : TWITTER)