WPL Auction 2023 Live Updates: ధనాధన్ లేడీ ధోనికి కూడా తక్కువ ధరే.. ఎవరు కొన్నారంటే..
WPL Auction 2023 Live Updates: ధనాధన్ లేడీ ధోనికి కూడా తక్కువ ధరే.. ఎవరు కొన్నారంటే..
WPL Auction 2023 Live Updates: టీ20 క్రికెట్ లో రిచా ఘోష్ చాలా డేంజరస్ బ్యాటర్. క్షణాల్లో ఆటను మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ ను ఆర్సీబీ చాలా తెలివిగా తక్కువ ధరకే సొంతం చేసుకుంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) 2023 వేలం ఘనంగా ఆరంభమైంది. ముంబై (Mumbai)లో జరుగుతున్న ఈ వేలంలో కీలక ప్లేయర్లు కోసం అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
2/ 7
ఇక, టీమిండియా ధనాధన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కోసం ఐపీఎల్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే.. చివరికి ఈ లేడి ధోనిని రూ. 1.90 కోట్లకు దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
3/ 7
ఎంఎస్ ధోనీని అమితంగా ఆరాధించే బెంగాలీ రిచా ఘోష్ ఇప్పటికే జాతీయ జట్టులో సభ్యురాలు. గత నెలలో ఆసీస్ తో జరిగిన సిరీస్ లో మెరుపులు మెరిపించింది. ఇక, పాకిస్తాన్ తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడింది రిచా.
4/ 7

5/ 7
ఇక, వేలంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.40 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే కడవరకు పట్టు వదలని ఆర్సీబీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది.
6/ 7
టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డా చివరకు ముంబై జట్టే సొంతం చేసుకుంది.
7/ 7
యాష్లే గార్డెనర్ రూ.3.20 కోట్లు కి గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంటే.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ సీవర్ న రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది యూపీ వారియర్స్.