WPL Auction 2023 Live Updates: తక్కువ ధరకే లేడీ సెహ్వాగ్.. ఇది అసలు ఊహించలేదు భయ్యా!
WPL Auction 2023 Live Updates: తక్కువ ధరకే లేడీ సెహ్వాగ్.. ఇది అసలు ఊహించలేదు భయ్యా!
WPL Auction 2023 Live Updates: టీ20 క్రికెట్ లో షఫాలీ చాలా డేంజరస్ బ్యాటర్. క్షణాల్లో ఆటను మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ ను ఢిల్లీ చాలా తెలివిగా తక్కువ ధరకే సొంతం చేసుకుంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) 2023 వేలం ఘనంగా ఆరంభమైంది. ముంబై (Mumbai)లో జరుగుతున్న ఈ వేలంలో కీలక ప్లేయర్లు కోసం అన్ని జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
2/ 7
ఇక, టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్.. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ చాంపియన్ టీమ్ కెప్టెన్ షఫాలీ వర్మ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు నడిచింది.
3/ 7
చివరికి లేడీ సెహ్వాగ్ ను షఫాలీను రూ.2 కోట్లకు దక్కించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే.. షఫాలీ ఇంత తక్కువ ధరకే దక్కించుకోవడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
4/ 7
టీ20 క్రికెట్ లో షఫాలీ చాలా డేంజరస్ బ్యాటర్. క్షణాల్లో ఆటను మార్చగల సత్తా ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ ను ఢిల్లీ చాలా తెలివిగా వ్యవహరించి రూ.2 కోట్లకే దక్కించుకుంది.
5/ 7
ఇక, వేలంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.40 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే కడవరకు పట్టు వదలని ఆర్సీబీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది.
6/ 7
టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డా చివరకు ముంబై జట్టే సొంతం చేసుకుంది.
7/ 7
యాష్లే గార్డెనర్ రూ.3.20 కోట్లు కి గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంటే.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ నటాలీ సీవర్ న రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. ఇక, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మను రూ. 2.60 కోట్లకు దక్కించుకుంది యూపీ వారియర్స్.