WPL 2023 : 216 స్ట్రయిక్ రేట్.. వరుసగా 7 ఫోర్లు.. తొలి మ్యాచ్ లో కుమ్మేసిన టీమిండియా కెప్టెన్
WPL 2023 : 216 స్ట్రయిక్ రేట్.. వరుసగా 7 ఫోర్లు.. తొలి మ్యాచ్ లో కుమ్మేసిన టీమిండియా కెప్టెన్
WPL 2023 : గుజరాత్ జెయింట్స్ తో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉండటం విశేషం.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) తొలి సీజన్ ఘనంగా ఆరంభమైంది. ముంబై (Mumbai)లోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా (Team India) సారథి.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఆకాశమే హద్దుగా చెలరేగింది. (PC : WPL)
2/ 8
గుజరాత్ జెయింట్స్ తో జరిగిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 65 పరుగులు చేసింది. ఇందులో 14 ఫోర్లు ఉండటం విశేషం. (PC : WPL)
3/ 8
నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఫోర్ల వర్షం కురిపించింది. ఆమె ఫోర్ల ద్వారానే 56 పరుగులు సాధించడం విశేషం. కేవలం 9 పరుగులను మాత్రమే వికెట్ల మధ్య పరుగెత్తుతూ సాధించింది. (PC : WPL)
4/ 8
15వ ఓవర్ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ ఆటను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్లో చివరి నాలుగు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్.. గార్డ్ నర్ వేసిన మరుసటి ఓవర్లో రెండో బంతికి స్ట్రయిక్ లోకి వచ్చింది. ఈ క్రమంలో హ్యాట్రిక్ బౌండరీలను బాదింది. (PC : WPL)
5/ 8
దాంతో వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలతో 28 పరుగులు పిండుకుంది. స్వీప్ షాట్స్‌తో పాటు కట్, పుల్ షాట్లతో అభిమానులను ఆకట్టుకుంది. స్టెప్ ఔట్ అవుతూ మిడ్ వికెట్ మీదుగా ఆమె కొట్టిన బౌండరీలు మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి. (PC : WPL)
6/ 8
హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు విండీస్ పవర్ హిట్టర్ హేలీ మ్యాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో అమీలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్లు ఆడింది. ఫలితంగా ముంబై భారీ స్కోరును అందుకుంది. (PC : WPL)
7/ 8
అనంతరం గుజరాత్ జెయింట్స్ భారీ లక్ష్య ఛేదనలో పూర్తిగా తడపడింది. 15.1 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. దాంతో ముంబై 143 పరుగుల భారీ తేడాతో గెలిచి సూపర్ బోణీ కొట్టింది. (PC : WPL)
8/ 8
సూపర్ బ్యాటింగ్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.