WPL 2023 : మొత్తం 5 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వీటిలో మూడు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లే సొంతం చేసుకున్నాయి. మిగతా రెండు జట్లు గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ గా ఉన్నాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) గత వారం ఘనంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్ కు మరింత ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో మహిళల విభాగంలో ఐపీఎల్ లాంటి లీగ్ కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది.
2/ 8
మొత్తం 5 జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. వీటిలో మూడు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లే సొంతం చేసుకున్నాయి. మిగతా రెండు జట్లు గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ గా ఉన్నాయి.
3/ 8
గత నెలలో జరిగిన వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడు కనబరిచిన సంగతి తెలిసిందే. స్మృతి మంధాన, పెర్రీ, రేణుక సింగ్, రిచా ఘోష్, సోఫీ డివైన్ లాంటి బడా ప్లేయర్లను సొంతం చేసుకుంది. ఇక మెంటార్ గా భారత దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను నియమించింది.
4/ 8
పేపర్ మీద చూస్తే ఆర్సీబీ ఉమెన్స్ టీం చాలా పటిష్టంగా కనిపించింది. దంచి కొట్టే ప్లేయర్లు ఉండటంతో మంచి ప్రదర్శనే చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే టోర్నీ ఆరంభమయ్యాక కథ రివర్స్ అయ్యింది.
5/ 8
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఓడింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో మరోసారి ఓడి టోర్నీలో రెండో ఓటమిని చవిచూసింది.
6/ 8
ఈ రెండు మ్యాచ్ ల్లోనూ స్మృతి మంధాన పేలవ ప్రదర్శన చేసింది. వేలంలో అత్యధిక ధర పలికిన ఈ స్టార్ ప్లేయర్ తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఆర్సీబీ మహిళల జట్టును చూస్తే పురుషుల జట్టు గుర్తుకు రాక మానదు.
7/ 8
ఆర్సీబీ పురుషుల జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవ లేదు. కోహ్లీ, డివిలియర్స్, క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ లాంటి ప్లేయర్లు ఉన్నా ఒక్కసారి కూడా ఐపీఎల్ చాంపియన్స్ గా నిలువలేకపోయింది.
8/ 8
ఇప్పుడు మహిళల ఆర్సీబీ కూడా పురుషుల జట్టు అడుగుజాడల్లోనే నడిచేలా కనిపిస్తోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఫైనల్ వరకు చేరాలంటే ఇప్పటి నుంచి వరుసగా విజయాలు సాధించాల్సిన పరిస్థితి.