15వ ఓవర్ నుంచి హర్మన్ ప్రీత్ కౌర్ ఆటను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్లో చివరి నాలుగు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్.. గార్డ్ నర్ వేసిన మరుసటి ఓవర్లో రెండో బంతికి స్ట్రయిక్ లోకి వచ్చింది. ఈ క్రమంలో హ్యాట్రిక్ బౌండరీలను బాదింది. దాంతో వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలతో 28 పరుగులు పిండుకుంది. (PC : WPL)