BCCI : హై స్కోరింగ్ గేమ్స్ కోసం బీసీసీఐ కొత్త ట్రిక్.. మండి పడుతున్న అభిమానులు.. ఏం చేసిందంటే?
BCCI : హై స్కోరింగ్ గేమ్స్ కోసం బీసీసీఐ కొత్త ట్రిక్.. మండి పడుతున్న అభిమానులు.. ఏం చేసిందంటే?
BCCI : అలా కాకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటే క్రికెట్ చూడాలనే ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అలా అని లో స్కోరింగ్ గేమ్స్ అభిమానులను అలరించవని కాదు. కానీ, ఎక్కువ శాతం అభిమానులు ధనాధన్ ఆటనే ఇష్టపడతారు.
క్రీజులో ఉన్న బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీ వర్షం కురిపిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. మ్యాచ్ ను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా చూసే వాళ్లకు అదిరిపోయే కిక్ దొరుకుతుంది. (PC : WPL)
2/ 8
అలా కాకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ ఉంటే క్రికెట్ చూడాలనే ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. అలా అని లో స్కోరింగ్ గేమ్స్ అభిమానులను అలరించవని కాదు. కానీ, ఎక్కువ శాతం అభిమానులు ధనాధన్ ఆటనే ఇష్టపడతారు. (PC : WPL)
3/ 8
ఇక తాజాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఘనంగా ఆరంభమైన సంగతి తెలిసిందే. మహిళల క్రికెట్ మరింతగా ప్రాచుర్యంలోకి రావడానికి ఈ లీగ్ ఎంతోగానో తోడ్పడుతుంది. (PC : WPL)
4/ 8
ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భారీ స్కోర్లు నమోదు కావడానికి బీసీసీఐ తీసుకున్న ఒక నిర్ణయంపై అభిమానులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు ఇంతలా దిగజారాల అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
5/ 8
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ బౌండరీ లైన్ ను మరికొంత ముందరకు జరిపింది. పురుషుల క్రికెట్ తో పోలిస్తే మహిళల క్రికెట్ లో బౌండరీలు కాస్త దగ్గరగా ఉంటాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈ బౌండరీల సైజ్ ను మరింతగా దగ్గరకు జరిపారు. (PC : WPL)
6/ 8
ఇటీవలె ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్ లో బౌండరీ లైన్స్ 65 మీటర్లుగా ఉన్నాయి. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఈ బౌండరీ లైన్ ను 60 మీటర్లకు కుదించారు. 60 మీటర్లు అంటే చాలా చిన్నవనే చెప్పాలి. (PC : WPL)
7/ 8
పురుషుల క్రికెట్ తో పోలిస్తే మహిళల క్రికెట్ కు ఆదరణ తక్కువే. ఇండియా లాంటి చోట కూడా మహిళల క్రికెట్ ను చాలా తక్కువ మొత్తంలో చూస్తారు. ఈ క్రమంలో భారీ స్కోర్లు నమోదైతేనా మ్యాచ్ లను చూడాలనే ఉత్కంఠ అభిమానుల్లో కలుగుతుందనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. (PC : WPL)
8/ 8
అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇది క్రికెట్ కు మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా జరిగిన తొలి పోరులో ముంబై ఇండియన్స్ సారథి హర్మన్ ప్రీత్ కౌర్ 14 ఫోర్లతో విరుచుకుపడింది. (PC : WPL)