ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్ ల్లో 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఒక్కో పరుగు రూ. 2.72 లక్షలతో సమానం. మహిళల ఐపీఎల్ లో వరుసగా ఎనిమిది మ్యాచుల్లో స్మృతి 35, 23, 18, 4, 8, 0, 37, 24 ఈ పరుగులు చేసింది. ఒక మ్యాచులో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయింది.
డబ్య్లూపీఎల్ లో కెప్టెన్ గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్ లో టీమిండియా వుమెన్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడుతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్య్లూపీఎల్ లో కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్ లోనూ దారుణ ప్రదర్శన చేసింది.