హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఢిల్లీపై ఆరంభం నుంచి ముంబై జట్టు పెట్టిన ఒత్తిడి చివరి వరకు కొనసాగింది. ఫలితంగా ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. టోర్నీ తొలి ఎడిషన్‌లో ముంబై 3 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లకు 134 పరుగులు చేసి విజేతగా నిలిచింది. (AP)
విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రైజ్ మనీగా 6 కోట్లు లభించాయి. మరోవైపు షాహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. విజేతగా నిలిచిన క్వాలండర్స్ జట్టుకు ప్రైజ్ మనీగా రూ.3.4 కోట్లు లభించాయి. అదే సమయంలో.. పిఎస్ఎల్ రన్నరప్ జట్టు అంటే ముల్తాన్ సుల్తాన్లకు రూ. 1.5 కోట్లు లభించాయి. (AP/Instagram)
ఇక ఫైనల్ లో నాట్ సీవర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. అజేయంగా 60 పరుగులు చేసి జట్టును ఛాంపియన్ గా నిలిపింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 39 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైంది. ముంబైకి ఆడుతున్న ఇంగ్లండ్ మీడియం పేసర్ ఇస్సీ వాంగ్ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించింది. మూడు వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టను డిఫెన్స్ లో పడేసింది. (AFP)