WPL 2023 : శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ వీరవిహారం చేసింది. కేవలం 28 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. షఫాలీ వర్మ స్ట్రయిక్ రేట్ 271.42గా ఉండటం విశేషం.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తన జోరును కొనసాగిస్తుంది. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చేతిలో ఎదురైన ఓటమి నుంచి త్వరగానే తేరుకుంది. బౌన్స్ బ్యాక్ అయిన ఆ జట్టు గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints)పై భారీ విక్టరీని సాధించింది. (WPL)
2/ 8
శనివారం జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై లేడీ సెహ్వాగ్ షఫాలీ వర్మ వీరవిహారం చేసింది. కేవలం 28 బంతుల్లోనే 76 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. షఫాలీ వర్మ స్ట్రయిక్ రేట్ 271.42గా ఉండటం విశేషం. (PC : WPL)
3/ 8
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. మరిజానె కాప్ దెబ్బకు విలవిల్లాడింది. 4 ఓవర్ల తన స్పెల్ లో 5 వికెట్లు తీసిన కాప్ గుజరాత్ ను దెబ్బ తీసింది. ఫలితంగా గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9వికెట్లు నష్టపోయి 105 పరుగులు చేసింది. (PC : WPL)
4/ 8
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఒక ఎండ్ లో షఫాలీ వర్మ విధ్వంసం చేస్తే.. మరో ఎండ్ లో కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) యాంకర్ రోల్ ప్లే చేసింది. (PC : TWITTER)
5/ 8
వీరిద్దరి ధాటికి మరో 77 బంతులు మిగిల ఉండగానే ఢిల్లీ క్యాపిటల్స్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో 6 పాయింట్లను ఖాతాలో వేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ టేబుల్లో 2వ స్థానంలో కొనసాగుతుంది. ముంబై ఇండియన్స్ 6 పాయింట్లతోనే ఉన్నా.. మెరుగైన రన్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది.
6/ 8
సగం టోర్నీ పూర్తయ్యాక.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ ఫేవరెట్స్ గా కనిపిస్తున్నాయి. ఇక ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన 4 మ్యాచ్ ల్లోనూ ఓడి లీగ్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. (PC : WPL)
7/ 8
ఇక యూపీ వారియర్స్ 4 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ 2 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. లీగ్ దశ ముగిశాక టాప్ 3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తాయి. (PC : Gujarat Gaints)
8/ 8
టేబుల్ టాపర్ గా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలమినేటర్ మ్యాచ్ ఈ నెల 24న జరగనుంది. ఫైనల్ 26న జరగనుంది. (PC : TWITTER)