మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) గెలుచుకుంది. ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నాట్ సీవర్ బ్రంట్ అజేయంగా 60 పరుగులు చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టును ఉత్కంఠభరితమైన విజయానికి చేర్చింది. (AP)
దీంతో ఐపీఎల్లో పురుషుల, మహిళల విభాగాల్లో టైటిల్ గెలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఫైనల్లో తొలుత ఆడిన మెగ్ లానింగ్ కెప్టెన్సీలో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లకు 131 పరుగులు చేసింది. అనంతరం ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హార్దిక్ పాండ్యా కూడా చాలా కాలం పాటు ముంబై తరఫున ఆడాడు. అయితే ఆల్ రౌండర్‌గా మాథ్యూస్ రికార్డు అతని కంటే మెరుగ్గా ఉంది. (Hayley Matthews Instagram)
ముంబై తరఫున వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ హేలీ మాథ్యూస్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ వేసింది. 4 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూడా తీసింది. ఇందులో రెండు మొయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. 25 ఏళ్ల మాథ్యూస్ టీ20 లీగ్‌లో అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టింది. బ్యాట్‌తోనూ అద్భుతమైన ఆటను కనబర్చింది మ్యాథ్యూస్. 10 మ్యాచ్‌ల్లో 30 సగటుతో 271 పరుగులు చేసింది. ఒక హాఫ్ సెంచరీ కూడా ఆమె ఖాతాలో చేరింది. అత్యుత్తమ ప్రదర్శన 77 నాటౌట్. ఆమె ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది.(Hayley Matthews Instagram)
హేలీ మాథ్యూస్ తండ్రి కూడా క్రికెటర్. క్లబ్ క్రికెట్‌ను దాటి ముందుకు సాగలేకపోయాడు. బార్బడోస్‌కు చెందిన మాథ్యూస్ 12 ఏళ్ల వయస్సులో స్థానిక జట్టుతో ఆడటం ప్రారంభించింది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. మరియు 18 సంవత్సరాల వయస్సులో ప్రపంచ కప్ గెలుచుకుంది. (Hayley Matthews Instagram)
హేలీ మాథ్యూస్ T20 అంతర్జాతీయ కెరీర్ గురించి మాట్లాడితే.., ఆమె 82 మ్యాచ్‌లలో 20 సగటుతో 1581 పరుగులు చేసింది. స్ట్రైక్ రేట్ 104. ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అజేయంగా 107 పరుగులు చేయడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. బౌలర్‌గా.. 18 సగటుతో 78 వికెట్లు కూడా తీసింది. 10 పరుగులకే 4 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. ఇక. మహిళల ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్లో మాథ్యూస్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. చివరికి రూ.40 లక్షల బేస్ ప్రైస్ పెట్టి ముంబై కొనుగోలు చేసింది. (AP)
హార్దిక్ పాండ్యా యొక్క T20 అంతర్జాతీయ రికార్డును పరిశీలిస్తే.. అతను 87 మ్యాచ్‌లలో 25 సగటుతో 1271 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అజేయంగా 71 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. ఫాస్ట్ బౌలర్‌గా.. అతను 26 సగటుతో 69 వికెట్లు కూడా తీసుకున్నాడు. 16 పరుగులకే 4 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. (AP)