ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సంపాదనలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇటీవలే జువెంటస్‌ను విడిచి పెట్టి మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు చెందిన రొనాల్డో.. మరో దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీని సంపాదనలో దాటేశాడు. ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రకటించిన జాబితాలో అత్యధికంగా సంపాదిస్తున్న ఫుట్‌బాలర్‌గా రొనాల్డో నిలిచాడు. 2021-22 సీజన్లో టాప్ 10 ఫుట్‌బాలర్స్ జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.
క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. ఈ సీజన్లోనే అతడు క్లబ్ మారాడు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం రొనాల్డో జీతం 70 మిలియన్ డాలర్లు. ఇక ఇతర ఎండోర్స్మెంట్ల ద్వారా మరో 55 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. రొనాల్డో మొత్తం 125 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఇండియన్స్ కరెన్సీలో రొనాల్డో మొత్తం సంపాదన రూ. 920 కోట్లు (PC: Forbes/Getty Images)
సుదీర్ఘ కాలంగా బార్సిలోనా ఎఫ్‌సీ తరపున ఆడిన లియోనల్ మెస్సీ.. ఈ సీజన్ నుంచి పారీస్ సెయింట్-జెర్మేన్ క్లబ్‌కు మారాడు. ఈ అర్జెంటీనా దిగ్గజ ప్లేయర్ జీతం రొనాల్డో కంటే ఎక్కువ. ఇతడికి జీతం రూపంలో 75 మిలియన్ డాలర్లు వస్తుండగా.. ఎండోర్స్మెంట్ల ద్వారా మరో 35 మిలియన్ డాలర్లు వస్తున్నాయి. మెస్సీ మొత్తం 110 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు. ఇండియన్ కరెన్సీలో మెస్సీ ఆదాయం రూ. 810 కోట్లు (PC: Forbes/Getty Images)
బ్రెజిల్‌కు చెందిన స్టార్ ప్లేయర్ నేమార్ ప్రస్తుతం పారిస్ సెయింట్-జెర్మేన్ క్లబ్ తరపున ఆడుతు్నాడు. 29 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. రొనాల్డో, మెస్సీ తర్వాత అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాడు నేమార్. అతడి జీతం 75 మిలియన్ డాలర్లు కాగా ఎండోర్స్మెంట్ల ద్వారా మరో 20 మిలియన్ వస్తున్నాయి. మొత్తం ఏడాదికి 95 మిలియన్ డాలర్లు నేమార్ ఖాతాలో పడుతున్నాయి. ఇండియన్ కరెన్సీలో నేమార్ సంపాదన రూ. 692 కోట్లు. (PC: Forbes/Getty Images)
ఫ్రాన్స్‌కు చెందిన కిలియన్ మబాప్పే తమ దేశానికే చెందిన పారీస్ సెయింట్-జెర్మేన్ తరపున ఆడుతున్నాడు. చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మబాప్పే.. ఇటీవల యూత్‌లో చాలా క్రేజ్ ఉన్న ఫుట్‌బాలర్‌గా మారాడు. మబాప్పే జీతం 28 మిలియన్లు కాగా ఎండోర్స్మెంట్ల ద్వారా మరో 15 మిలియన్ వస్తున్నాయి. అతడి మొత్తం సంపాదన 43 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో మబాప్పే సంపాదన రూ. 316 కోట్లు. (PC: Forbes/Getty Images)
ఈజిప్టుకు చెందిన మహ్మద్ సలాహ్ యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్స్‌లో ఆడుతూ బాగా సంపాదిస్తున్నాడు. ఈజిప్టులో పెద్ద సెలెబ్రిటీ అయిన సలాహ్.. లివర్‌పూల్ క్లబ్ తరపున సాకర్ ఆడుతున్నాడు. అతడికి జీతం ద్వారా 25 మిలియన్ డాలర్లు, ఎండర్స్మెంట్ల ద్వారా 16 మిలియన్ డాలర్లు మొత్తం 41 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇండియన్ కరెన్సీలో మహ్మద్ సలాహ్ సంపాదన రూ. 302 కోట్లు (PC: Forbes/Getty Images)
పోలాండ్‌కు చెందిన రాబర్ట్ లెండోస్కీ ఫోర్బ్స్ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. బెరెన్ మ్యూనిచ్ తరపున ఆడుతున్న అతడి మొత్తం సంపాదన 35 మిలియన్ డాలర్లు. వీటిలో జీతం ద్వారా 27 మిలియన్ డాలర్లు, ఎండార్స్మెంట్ల ద్వారా మరో 8 మిలియన్ డాలర్లు లభిస్తున్నాయి. ఇండియన్ కరెన్సీలో ఇతడి సంపాదన రూ. 257 కోట్లు. (PC: Forbes/Getty Images)
స్పెయిన్‌కు చెందిన ఆండ్రెస్ ఇనిస్టా ఫుట్‌బాల్ ప్రపంచంలో సుపరిచితమైన పేరు. జపాన్ ఫుట్‌బాల్ క్లబ్ విస్సెల్ కోబ్ తరపున ఆడుతున్న ఇతడికి 31 మిలియన్ డాలర్ల జీతం వస్తుంది. ఇక ఎండార్స్మెంట్ల ద్వారా మరో 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నాడు. మొత్తం సంపాదన 35 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో ఇతడి సంపాదన రూ. 257 కోట్లు. (PC: Forbes/Getty Images)
ఫ్రాన్స్‌కు చెందిన పాల్ పోగ్బా ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ తరపున ఆడుతున్నాడు. జీతం రూపంలో అతడికి 27 మిలియన్ డాలర్లు వస్తుండగా.. ఎండార్స్మెంట్ల ద్వారా మరో 7 మిలియన్ డాలర్లు వస్తున్నాయి. అతడి మొత్తం సంపాదన 34 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో పోగ్బా సంపాదన రూ. 250 కోట్లు (PC: Forbes/Getty Images)
యునైటెడ్ కింగ్డమ్కు చెందిన గెరెత్ బాలే ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. 32 ఏళ్ల గెరెత్ బాలేకు 26 మిలియన్ డాలర్ల జీతం వస్తుండగా.. మరో 6 మిలియన్ ఎండార్స్మెంట్ల రూపంలో వస్తున్నది. ఇతడి మొత్తం సంపాదన 32 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో గెరెత్ బాలే సంపాదన రూ. 235 కోట్లు. (PC: Forbes/Getty Images)
బెల్జియం దేశానికి చెందిన ఈడెన్ హజార్డ్ ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ జట్టు తరపున ఆడుతున్నాడు. జీతం రూపంలో అతడికి 26 మిలియన్ డాలర్లు లభిస్తుండగా.. ఎండార్స్మెంట్ల ద్వారా మరో 3 మిలియన్ డాలర్లు అతడి ఖాతాలో చేరుతున్నాయి. ఈడెన్ హజార్డ్ మొత్తం సంపాదన 29 మిలియన్ డాలర్లు. ఇండియన్ కరెన్సీలో అతడి సంపాదన రూ. 235 కోట్లు. (PC: Forbes/Getty Images)