మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ (Pakistan)తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో పర్యాటక ఇంగ్లండ్ (England) అద్భుత ప్రదర్శన చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో అంతిమంగా ఇంగ్లండ్ విజయం సాధించింది. రావల్పిండి వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈసారి ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా మరో 8 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో భారత్ తో పాటు సౌతాఫ్రికాతో మూడు విండీస్ తో ఒకటి ఉన్నాయి. విండీస్, సౌతాఫ్రికాతో జరిగే టెస్టులు ఆసీస్ వేదికగా జరగనున్నాయి. ఈ క్రమంలో వాటిలో ఆసీస్ సులభంగా గెలిచే అవకాశం ఉంది.
ఇక శ్రీలంక విషయానికొస్తే.. డబ్ల్యూటీసీ తాజా సీజన్లో శ్రీలంకకు మిలిగి ఉన్న టెస్టులు రెండు మాత్రమే. ఇందుకోసం లంక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ కివీస్ గడ్డపై లంక రికార్డు చెత్తగా ఉంది. అక్కడ శ్రీలంక 19 మ్యాచ్లు ఆడితే గెలిచింది రెండు మాత్రమే! ఒకవేళ కివీస్ టూర్లో చేదు అనుభవం ఎదురైతే లంక టాప్-2కు చేరడం దాదాపు అసాధ్యం.