Iga Swiatek : మట్టికోర్టు మహారాణి స్వియాటెక్.. ఫైనల్లో ప్రత్యర్థి ఉక్కిరి బిక్కిరి..
Iga Swiatek : మట్టికోర్టు మహారాణి స్వియాటెక్.. ఫైనల్లో ప్రత్యర్థి ఉక్కిరి బిక్కిరి..
Iga Swiatek : ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ క్వీన్ గా అవతరించింది. ఫైనల్లో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ అమ్మడు రెండో సారి ఫ్రెంచ్ ఓపెన్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఫ్రెంచ్ మట్టికోర్టుల్లో మహారాణి ఎవరో తేలిపోయింది. ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ (Iga Swiatek) లో మరోసారి దుమ్మురేపింది. అద్భుత ఆటతీరుతో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. (Image Credit: Twitter)
2/ 6
అద్భుతంగా ఆడుతూ ఫైనల్ చేరిన అమెరికన్ కోకో గాఫ్‌పై స్వియాటెక్ ఘనవిజయం సాధించింది. ప్యారిస్‌లోని కోర్ట్ ఫిలిప్లపే ఛాట్రియర్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోకోపై 6-1, 6-3తో సూపర్ విక్టరీ నమోదు చేసింది. (Image Credit: Twitter)
3/ 6
మ్యాచ్ ఆరంభం నుంచే తన సత్తా ఏంటో చూపించింది స్వియాటెక్. తొలి సెట్ నుంచే స్వియాటెక్ తన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లను అద్భుతంగా ఆడటంతో కోకో గాఫ్ దగ్గర సమాధానం లేకపోయింది. (Image Credit: Twitter)
4/ 6
ఒక గంటా 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తన ఆటతో కోకోకి చుక్కలు చూపించింది. స్వియాటెక్ వేగాన్ని అందుకోవడానికి కోకో చాలా కష్టపడింది. దీంతో.. వరుసగా రెండు సెట్లలోనూ చేతులేత్తేసింది. (Image Credit: Twitter)
5/ 6
స్వియాటెక్ కి ఇది రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ . ఇక 2020లో తన మొదటి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను స్వియాటెక్ సాధించింది. ఇది ఆమెకు వరుసగా 35వ విజయం కావడం గమనార్హం. (Image Credit: Twitter)
6/ 6
ఇక, ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన స్వియాటెక్ కి దాదాపు రూ.18 కోట్ల 25 లక్షలు ప్రైజ్ మనీగా దక్కింది. రన్నరప్ కోకో గాఫ్ క రూ.9 కోట్ల 14 లక్షలు ప్రైజ్ మనీ అందుకుంది. (Image Credit: Twitter)