దాంతో మరోసారి పాకిస్తాన్ పై తనదే పైచేయి అని భారత్ చాటిచెప్పింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో జట్టును ముందుకు నడిపింది. అయేషా నసీం (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో ధనాధన్ బ్యాటింగ్ పాకిస్తాన్ కు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో తోడ్పడింది.