న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ 2022 (Women's World Cup 2022) టోర్నీ ఆద్యంతం ఆసక్తికరంగా మారుతోంది. లీగ్ స్టేజీ ఆఖరికి చేరినా.. పూర్తిగా సెమీఫైనలిస్టులు ఇంకా ఖరారు కాలేదు. ప్పటికే ఆరుకి ఆరు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా, టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది. లేటెస్ట్ గా సౌతాఫ్రికా అమ్మాయిలు సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు. దీంతో, మిథాలీసేన (Indian Womens Team)కు మరోసారి సెమీస్ లెక్కలు మారిపోయాయ్.
సెమీస్ చేరిన రెండో జట్టుగా సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ నిలిచింది. మొదటి నాలుగు మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకున్న సౌతాఫ్రికా, ఐదో మ్యాచ్‌లో ఆసీస్ చేతుల్లో తొలి పరాజయాన్ని చవి చూసింది. అయితే, వెస్టిండీస్ తో జరగాల్సిన మ్యాచ్ లో వరుణుడు సౌతాఫ్రికాకు అండగా నిలబడటంతో వారు సెమీస్ కు చేరుకున్నారు. (PC Credit : ICC)
వెస్టిండీస్, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ఆరంభానికి ముందే వర్షం కురవడంతో 26 ఓవర్లకు గేమ్ ను కుదించారు అంపైర్లు. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి, బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్, 10.5 ఓవర్లలో 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. మరోసారి వరుణుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి కుండపోత వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపివేశారు అంపైర్లు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ కొనసాగించడం కష్టమేనని తేల్చి.. వెస్టిండీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే వర్షం కారణంగా సౌతాఫ్రికా లక్కీగా సెమీస్ కు చేరగా.. వెస్టిండీస్, భారత జట్టు అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఐదు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ మహిళా జట్టు, ప్రస్తుతం పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
లేదా సఫారీ జట్టుకి లక్ కలిసి వచ్చినట్టే, ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే... నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్నందున భారత మహిళా జట్టు ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్తుంది. ఒకవేళ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ చేతుల్లో ఓడిపోయి, భారత జట్టు కూడా సఫారీ టీమ్ చేతుల్లో ఓడితే... ఇరు జట్ల నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ చేరే జట్టును నిర్ణయించాల్సి ఉంటుంది. మొత్తానికి మిథాలీ సేనకు డూ ఆర్ డై గా పరిస్థితులు మారిపోయాయ్.