తొలి రెండు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ రేసులో ముందుండగా.. తర్వాతి రెండు స్థానాల కోసం భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ పోటి పడుతున్నాయి. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. భారత్‌పై విజయంతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. దీంతో, మిథాలీసేన సెమీస్ చేరాలంటే తుదపరి ఆడే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మార్చి 18న బలమైన ఆస్ట్రేలియాతో తలపడనున్న మిథాలీ సేన.. 22న బంగ్లాదేశ్, 27 సౌతాఫ్రికాతో పోటీపడనుంది. ఆసీస్‌పై విజయం సాధిస్తే సెమీస్ బెర్త్‌తో పాటు అమ్మాయిల ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా.. నాలుగింటిలో విజయం సాధించి పాయిట్స్టేబుల్లో టాప్ లో కొనసాగుతోంది. ఇక, టీమిండియాలో స్మృతి మంధాన, హర్మన్ తప్ప మిగతా వారు సరిగ్గా రాణించడం లేదు. మరీ భారత అమ్మాయిలు ఏం చేస్తారో చూడాలి.