మహిళల ప్రపంచకప్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన (Mithali Raj Team) ఓటమి పాలైంది. సూపర్ బ్యాటింగ్‌తో రాణించినా పేలవ బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకున్నారు భారత అమ్మాయిలు (Indian Womens Team). ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.
అయితే, ఈ ఓటమితో మిథాలీ సేన సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయ్. ఇక వరుసగా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆసీస్.. ఇతర మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సెమీస్ బెర్త్ ఖారారు చేసింది. ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన సౌతాఫ్రికా కూడా 8 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కతుంది.
భారత్ సెమీస్ చేరాలంటే.. ఈ రెండు మ్యాచ్‌లు మెరుగన రన్ రేట్‌తో గెలవడంతో పాటు న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఓడిపోవాలి. సౌతాఫ్రికా రూపంలో భారత్‌కు గండం ఎదురవ్వనుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మార్చి 22న బంగ్లాదేశ్‌తో, 27న సౌతాఫ్రికాతో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది.
వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. భారత్‌పై విజయంతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. దీంతో, మిథాలీసేన సెమీస్ చేరాలంటే తుదపరి ఆడే ప్రతీ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, టీమిండియాలో ఒకరిద్దరూ తప్ప.. అందరూ కలిసికట్టుగా ఆడటం లేదు. ఆల్ రౌండ్ షోతో అదరగొడితే.. అమ్మాయిలు సెమీస్ చేరే అవకాశాలు మెరుగపడతాయ్.