ఇక బ్యాటింగ్ సమయంలో ఒక దశలో ఇంగ్లండ్ బలంగా కనిపించింది. అయితే చెత్త షాట్లు ఆడుతూ వికెట్లను కోల్పోయింది. హర్మన్ ప్రీత్ రనౌట్ కంటే కూడా ఇంగ్లండ్ ప్లేయర్లు అవుటైన విధానాన్ని ‘స్కూల్ గర్ల్స్ ఎర్రర్’గా పేర్కొంటే బాగుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమిని ఇప్పట్లో నాసీర్ హుస్సేన్ జీర్ణించుకోలేకపోవచ్చు. (PC : ICC)