Team India : ఏంటమ్మా ఈ ఆట.. టీమిండియాకు నువ్వే మూలస్థంభం అనుకుంటే.. రోడ్డున పడేసేలా ఉన్నావే
Team India : ఏంటమ్మా ఈ ఆట.. టీమిండియాకు నువ్వే మూలస్థంభం అనుకుంటే.. రోడ్డున పడేసేలా ఉన్నావే
Team India : 2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది. అనంతరం గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మరోసారి ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది.
దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా ఫిబ్రవరి 10 నుంచి మహిళల టి20 ప్రపంచకప్ (Women's T20 World Cup 2023) ఆరంభం కానుంది. మొత్తం 10 జట్లు తమ లక్ ను పరీక్షించుకోనున్నాయి. ఈ క్రమంలో టీమిండియా (Team India) కూడా అదరగొట్టేందుకు రెడీ అయ్యింది.
2/ 8
2020లో జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది. అనంతరం గతేడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో మరోసారి ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచింది.
3/ 8
అయితే ఈసారి మాత్రం కప్పుతోనే ఇంటికి తిరిగి రావాలనే పట్టుదల మీద ఉంది. అయితే టీమిండియాను ఒక సమస్య వేధిస్తోంది. అదే స్మృతి మంధాన ఫామ్. ఈ స్టార్ ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ గత కొన్ని రోజులుగా ఫామ్ తో నానా తంటాలు పడుతుంది.
4/ 8
చివరి 10 టి20ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది. ఆరు సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. తాజాగా ముగిసిన ట్రై సిరీస్ లో 5 మ్యాచ్ ల్లో కేవలం 86 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఒక మ్యాచ్ లోనే 74 బాదింది.
5/ 8
ఇక ఈ ట్రై సిరీస్ ఫైనల్లో స్మృతి మంధాన డకౌట్ గా వెనుదిరిగింది. 8 బంతులు ఆడిన ఆమె ఖాతా కూడా తెరవకుండానే అవుటైంది. ఫైనల్ మ్యాచ్ ల్లో చేతులెత్తేస్తుందనే అపవాదు స్మృతి మంధానకు ఉంది.
6/ 8
స్మృతి మంధాన తన చివరి 10 మ్యాచ్ ల్లో వరుసగా 28, 79, 1, 16, 6 (ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో), 7, 74, 0, 5, 0 (ట్రై సిరీస్ లో) పరుగులు చేసింది. నిజయితీగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో స్మృతి మంధాన తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోతుంది.
7/ 8
మహిళల టి20 ప్రపంచకప్ లో భారత్ అద్భుతాలు సాధించాలంటే స్మృతి మంధాన ఎంతో కీలకం. ఈ డాషింగ్ ఓపెనర్ మంచి ఆరంభాలను చేస్తేనే భారత్ విజయాలు తేలిక అవుతాయి. లేదంటే టీమిండియాకు ఓటములు ఖాయం.
8/ 8
స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ లు కూడా రాణించాల్సి ఉంది. బౌలింగ్ లో దీప్తి శర్మ రాణిస్తున్నప్పటికీ బ్యాటర్ గా మాత్రం పేలవ ప్రదర్శన చేస్తుంది. ముఖ్యంగా దూకుడును కనబర్చాలి.