Women's T20 World Cup 2023 : ప్రపంచకప్ లో లేడి ధోని విశ్వరూపం.. బంగ్లా జట్టుకు పట్టపగలే చుక్కలు
Women's T20 World Cup 2023 : ప్రపంచకప్ లో లేడి ధోని విశ్వరూపం.. బంగ్లా జట్టుకు పట్టపగలే చుక్కలు
Women's T20 World Cup 2023 : అయితే బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విశ్వరూపం ప్రదర్శించింది. సిక్సర్లతో బంగ్లాదేశ్ పై విరుచుకుపడింది.
మహిళల టి20 ప్రపంచకప్ 2023 (Women's T20 World Cup)లో భాగంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో టీమిండియా (Team India) మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో కేవలం 85 పరుగులకే కుప్పకూలి నిరాశ పరిచింది. (PC : BCCI)
2/ 8
అయితే బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయింది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విశ్వరూపం ప్రదర్శించింది. సిక్సర్లతో బంగ్లాదేశ్ పై విరుచుకుపడింది. (PC : TWITTER)
3/ 8
కేవలం 56 బంతుల్లోనే 91 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇందులో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండటం విశేషం. ఈమె దెబ్బకు బంగ్లాదేశ్ సీనియర్ బౌలర్ జహనార 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకుంది. (PC : TWITTER)
4/ 8
క్రికెట్ లో రిచా ఘోష్ ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్ లో ఉంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో ఫినిషర్ రోల్ ను చక్కగా నిర్వర్తిస్తోంది. గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లోనూ ఫినిషర్ గా రిచా ఘోష్ మంచి ప్రదర్శన చేసింది. (PC : TWITTER)
5/ 8
ప్రస్తుతం అభిమానులు ఆమెకు లేడీ ధోని అనే ట్యాగ్ ను ఇచ్చేశారు. ఇక ఈ మ్యాచ్ లో రిచా ఘోష్ తో పాటు జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. (PC : BCCI)
6/ 8
అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులకే పరిమితం అయ్యింది. భారత బౌలర్లలో దేవిక వైద్య రెండు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. (PC : BCCI)
7/ 8
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2020 టి20 ప్రపంచకప్ లో టీమిండియా ఫైనల్లో ఓడింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ రన్నరప్ గా నిలిచింది. (PC : BCCI)
8/ 8
ఇక భారత తన తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. ఫిబ్రవరి 12న జరిగే ఈ పోరులో పాకిస్తాన్ తో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం గం. 6.30లకు ఆరంభం కానుంది. (PC :Twitter)