IND vs PAK : ఫిబ్రవరిలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
IND vs PAK : ఫిబ్రవరిలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
IND vs PAK : ఫిబ్రవరి నెలలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. అది కూడా చిన్నా చితక టోర్నీల్లో కాదు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు సై అంటే సై అనడానికి సిద్దమయ్యాయి.
క్రికెట్ లో దాయాదుల సమరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. త్వరలోనే మరోసారి ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి.
2/ 7
ఫిబ్రవరి నెలలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. అది కూడా చిన్నా చితక టోర్నీల్లో కాదు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు సై అంటే సై అనడానికి సిద్దమయ్యాయి.
3/ 7
ఫిబ్రవరి 10వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడబోతున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది కూడా.
4/ 7
ఫిబ్రవరి 12న భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య టి20 పోరు జరగనుంది. ఈ రెండు జట్లు కూడా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
5/ 7
గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు ఉండగా.. గ్రూప్ ‘బి’లో భారత్, పాకిస్తాన్ లతో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
6/ 7
చివరిసారిగా మహిళల టి20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగింది. అప్పుడు భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్ గా నిలిచింది. అయితే ఈసారి మాత్రం కప్పు కొట్టాలనే పట్టుదల మీద హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీం ఉంది.
7/ 7
ఇప్పటికే భారత మహిళల జట్టు సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. ప్రపంచకప్ కు సన్నాహకంగా ట్రై సరీస్ ను ఆడుతుంది. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఈ ట్రై సిరీస్ లో భాగంగా ఉన్నాయి.