Team India : ఇలా అయితే ఈ ప్రపంచకప్ కూడా తుస్సే.. టీమిండియా మరోసారి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుందా?
Team India : ఇలా అయితే ఈ ప్రపంచకప్ కూడా తుస్సే.. టీమిండియా మరోసారి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటుందా?
Team India : అయితే సెమీఫైనల్లో భారత్ మరోసారి చేతులెత్తేసింది. నాకౌట్ ఫోబియాకు మరోసారి చిత్తై ఇంటిదారి పట్టింది. ఇక మహిళల జట్టు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోదు. వన్డే, టి20 ప్రపంచకప్ లలో ఫైనల్ వరకు చేరడం అక్కడ చేతులెత్తేయడం అలవాటుగా మార్చుకుంది.
గతేడాది జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్ (Women's T20 World Cup 2023) ముందు టీమిండియా (Team India) సూపర్ ఫామ్ లో ఉంది. ప్రపంచకప్ ఆరంభ రౌండ్లో కూడా అదరగొట్టింది. ఈ క్రమంలో సెమీఫైనల్ కు చేరుకుంది.
2/ 9
అయితే సెమీఫైనల్లో భారత్ మరోసారి చేతులెత్తేసింది. నాకౌట్ ఫోబియాకు మరోసారి చిత్తై ఇంటిదారి పట్టింది. ఇక మహిళల జట్టు కూడా ఇందుకు ఏ మాత్రం తీసిపోదు. వన్డే, టి20 ప్రపంచకప్ లలో ఫైనల్ వరకు చేరడం అక్కడ చేతులెత్తేయడం అలవాటుగా మార్చుకుంది.
3/ 9
సౌతాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ ఈ నెలలోనే ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీకి సన్నాహక సిరీస్ ను భారత మహిళల జట్టు ఆడింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో కలిసి ట్రై సిరీస్ ను ఆడింది.
4/ 9
గ్రూప్ దశలో ఒక్కసారి కూడా ఓడకుండా ఫైనల్ వరకు చేరుకున్న భారత మహిళల జట్టు.. తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని ప్రత్యర్థికి సమర్పించుకుని రన్నరప్ గా నిలిచింది.
5/ 9
మ్యాచ్ అనంతరం ఈ ఫైనల్ నుంచి కొన్ని పాఠాలను నేర్చుకన్నామని భారత క్రికెటర్లు పేర్కొన్నారు. తమ తప్పులను సరిదిద్దుకుని టి20 ప్రపంచకప్ ఫైనల్లో అదరగొడతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
6/ 9
దీనిపై అభిమానుల నుంచి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. టోర్నీకి ముందు అదరగొడతామని అనడం.. ఆ తర్వాత చేతులెత్తేయడం అటు పురుషుల క్రికెట్ జట్టుకు, ఇటు మహిళల టీంకు అలవాటైన పనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
7/ 9
ఫిబ్రవరి 10 నుంచి మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో భారత్ తన తొలి మ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఫిబ్రవరి 12న (ఆదివారం) ఆడనుంది.
8/ 9
సెమీస్ చేరుకోవడం భారత్ కు పెద్ద కష్టం కాకపోచ్చు. అయితే సెమీస్ నుంచే టీమిండియాకు అసలైన పరీక్ష ఎదురు కానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి బలమైన జట్లతో తలపడే అవకాశం రావొచ్చు.
9/ 9
ఈ క్రమంలో గత ఫైనల్స్ లో చేసిన తప్పులను సరి చేసుకుని సమష్టిగా కష్టపడితేనే భారత్ కప్పు గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే మరోసారి నాకౌట్ పోరుల్లో ఓడి ఇంటికి రావడం ఖాయం.