దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ నిన్న ప్రారంభమైంది. భారత మహిళల జట్టు ఫిబ్రవరి 12న పాకిస్థాన్‌తో తన ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో గ్రూప్-Bలో ఉన్న భారత్.. ఫిబ్రవరి 15న వెస్టిండీస్‌తో సెకండ్ మ్యాచ్, ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్‌తో మూడో మ్యాచ్, ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది.
టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న స్మృతి దూరమైతే జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఈ స్టార్ ఓపెనర్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. పాక్‌తో మ్యాచ్‌కు స్మృతి దూరమైతే బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రభావం పడనుంది. భారత బ్యాటింగ్ లైనప్‌కు స్మృతి గైర్హాజరు పెద్ద బలహీనంగా మారనుంది. అందులోనూ ఫస్ట్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గెలిచి, ఆత్మస్థైర్యంతో టోర్నీలో ముందుకు సాగాలని ప్లాన్ వేసిన టీమ్‌కు.. ఆదిలోనే ఆటంకం ఎదురవుతోంది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో పాటు భారత్ కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.