WPL Auction 2023 Live Updates : వేలంలో జాక్ పాట్ కొట్టేసిన లేడీ గంగూలీ.. రికార్డు ధరకు సొంతం చేసుకున్న ఆర్సీబీ
WPL Auction 2023 Live Updates : వేలంలో జాక్ పాట్ కొట్టేసిన లేడీ గంగూలీ.. రికార్డు ధరకు సొంతం చేసుకున్న ఆర్సీబీ
WPL Auction 2023 Live Updates : వేలంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.40 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే కడవరకు పట్టు వదలని ఆర్సీబీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) 2023 వేలం ఘనంగా ఆరంభమైంది. ముంబై (Mumbai)లో జరుగుతున్న ఈ వేలంలో లేడీ గంగూలీ స్మృతి మంధాన (Smriti Mandhana) భారీ ధర పలికింది.
2/ 6
వేలంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.40 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే కడవరకు పట్టు వదలని ఆర్సీబీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది.
3/ 6
ప్రతి జట్టు కూడా రూ. 12 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంది. స్మృతి మంధాన కోసం తన వేలం పర్సు నుంచి దాదాపుగా 30 శాతాన్ని ఆర్సీబీ ఖర్చు చేయడం విశేషం.
4/ 6
ప్రస్తుతం స్మృతి మంధాన వరల్డ్ క్రికెట్ లోనూ టాప్ ఓపెనర్ గా ఉంది. దాంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆర్సీబీ పట్టుదల ప్రదర్శంచింది.
5/ 6
ఆ తర్వాత వచ్చిన టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డా చివరకు ముంబై జట్టే సొంతం చేసుకుంది.
6/ 6
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి 26 మధ్య ముంబై వేదికగా జరగనుంది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ టైటాన్స్ ఈ లీగ్ జట్లుగా ఉన్నాయి.