WPL Auction 2023 Live Updates : ఆ ఇద్దరు విదేశీ ప్లేయర్లపై కోట్లకు కోట్లు గుమ్మరించిన ఫ్రాంచైజీలు.. ఎవరంటే?
WPL Auction 2023 Live Updates : ఆ ఇద్దరు విదేశీ ప్లేయర్లపై కోట్లకు కోట్లు గుమ్మరించిన ఫ్రాంచైజీలు.. ఎవరంటే?
WPL Auction 2023 Live Updates : ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ యాష్లీ గార్డ్ నర్ పై గుజరాత్ జెయింట్స్ కోట్లు గుమ్మరించింది.
ముంబై (Mumbai) వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023 Auction) 2023 వేలంలో ఫ్రాంచైజీలు ప్లేయర్లపై కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మన దేశ ప్లేయర్ల కంటే కూడా విదేశీ ప్లేయర్లే ఎక్కువ ధర పలుకుతున్నారు.
2/ 8
ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ యాష్లీ గార్డ్ నర్ పై గుజరాత్ జెయింట్స్ కోట్లు గుమ్మరించింది. (PC : TWITTER)
3/ 8
ఏకంగా రూ. 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. గార్డ్ నర్ కోసం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తీవ్ర పోటీ నడిచింది. అయితే చివరకు గుజరాత్ జట్టే సొంతం చేసుకుంది. (PC : TWITTER)
4/ 8
ప్రస్తుతం జరుగుతున్న మహిళల టి20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ పై గార్డ్ నర్ 5 వికెట్లతో మెరిసింది. ప్రస్తుతం మహిళల క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా ఉంది. (PC : TWITTER)
5/ 8
ఇక ఈమెతో పాటు ఇంగ్లండ్ కు చెందిన మరో స్టార్ ప్లేయర్ నటాలి సీవర్ ను రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. యూపీతో పోటీ పడి మరీ నాట్ సీవర్ ను ముంబై సొంతం చేసుకుంది. (PC : TWITTER)
6/ 8
వీరిద్దరు కూడా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కంటే ఎక్కువ ధర పలకడం విశేషం. కౌర్ ను రూ.1.80 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. హర్మన్ ప్రీత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డా చివరకు ముంబై జట్టే సొంతం చేసుకుంది. (PC : TWITTER)
7/ 8
వేలంలో స్మృతి మంధానను ఆర్సీబీ రూ. 3.40 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. ఈమె కోసం ముంబై ఇండియన్స్, ఆర్సీబీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే కడవరకు పట్టు వదలని ఆర్సీబీ భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. (PC : TWITTER)
8/ 8
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి 26 మధ్య ముంబై వేదికగా జరగనుంది. ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్, గుజరాత్ టైటాన్స్ ఈ లీగ్ జట్లుగా ఉన్నాయి. (PC : TWITTER)