ఇక 2015,2017,2019,2020 సీజన్లలో ముంబై ట్రోఫీ పట్టుకుపోయింది. లీగ్ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన టీమ్ ముంబై మాత్రమే.. ఆ ఐదు సార్లు ముంబై కెప్టెన్‌గా ఉంది రోహిత్ శర్మనే.. ఐపీఎల్లో తనలోని లీడర్షిప్ క్వాలిటీస్‌ను ప్రపంచక్రికెట్‌కు చూపించిన రోహిత్.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా అవతరించాడు.. (Image Credits gettyimages)
హర్మన్‌ప్రీత్(Harmanpreet kaur)కు భారత్ తరఫున ఎక్కువ టీ20లు ఆడిన అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆమె 147 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఆమె సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఇద్దరు టీమిండియా సారథులు ఇప్పుడు ముంబై జట్టుకే ఆడుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. (Image Credits gettyimages)