సాధారణంగా భారత్ మహిళల దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో దీనికి ఒక నెల రోజులు ముందుకు జరిపారు. 2022–23 సీజన్ అక్టోబర్ 11న ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే మార్చి నెలలో పూర్తి స్థాయి ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ కేప్‌టౌన్, ముంబై ఇండియన్స్" width="1600" height="1600" /> ఐపీఎల్ లో అత్యంత సక్సెస్ ఫుల్ టీమ్స్ గా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లతో పాటు రాజస్తాన్ రాయల్స్ కూడా మహిళల ఐపీఎల్ లో టీంలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.