గతేడాది మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన నొవాక్.. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. వ్యాక్సిన్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో వైరం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్ లో బరిలోకి దిగలేదు. అనంతరం ఫ్రెంచ్ ఓపెన్ లో ఆడినా క్వార్టర్ ఫైనల్లో నాదల్ చేతిలో ఓడిపోయాడు. (PC : TWITTER)
వ్యాక్సిన్ వేయించుకోవాలా వద్దా అనేది సదరు వ్యక్తిగత నిర్ణయమని జొకోవిచ్ మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నాడు. ఇష్టం లేకుండా వ్యాక్సిన్ వేయించుకోవడం సహేతుకం కాదని జొకోవిచ్ పేర్కొన్నాడు. అలా అని తాను వ్యాక్సిన్ కు వ్యతిరేకం కాదని కూడా ఇప్పటికే పలుమార్లు వివరణ ఇచ్చాడు. తాను మాత్రం వ్యాక్సిన్ వేయించుకునే ప్రసక్తే లేదని జొకోవిచ్ మరోసారి స్పష్టం చేశాడు. (PC : TWITTER)