IND vs NZ: శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. ఇండియా 345 ఆలౌట్.. రెండో రోజు కివీస్‌దే ఆధిపత్యం.. న్యూజీలాండ్ 129/0

IND vs NZ: తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం అయినా.. రెండో రోజు మాత్రం కివీస్ పూర్తిగా డామినేట్ చేసింది. టిమ్ సౌథీ అద్బుతమైన బౌలింగ్‌తో టీమ్ ఇండియా భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు చాలా ఓపికగా బ్యాటింగ్ చేశారు. న్యూజీలాండ్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో కనపడుతున్నది. న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 216 పరుగులు వెనుకబడింది.