టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావ (Shikhar Dhawan) న్ తన భార్య అయేషా ముఖర్జీ (Aesha Mukherjee)తో విడాకులు తీసుకున్నాడా?. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికాడా ? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. శిఖర్ భార్య అయేషా ముఖర్జీ లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. (Instagram)
శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీకి అప్పటికే పెళ్లై, విడాకులు కూడా తీసుకుంది. విడాకులు తీసుకుని 10 ఏళ్లు ఒంటరిగా జీవించిన తర్వాత అయేషా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు గబ్బర్. ఆంగ్లో ఇండియన్ అయిన అయేషా తండ్రి బెంగాళీ, ఆమె తల్లి బ్రిటన్ దేశస్థురాలు. అయేషా కుటుంబం మొత్తం ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యింది. అయేషా కూడా అక్కడే పుట్టి పెరిగింది. (Instagram)
అయేషా, భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కి ఫేస్బుక్ ఫ్రెండ్. శిఖర్ ధావన్, భజ్జీ ఫేస్బుక్లో అయేషా ఫోటో చూశాడు. తొలి చూపులోనే ఆయేషా ప్రేమలో పడిన ధావన్, వెంటనే ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. భజ్జీ స్నేహితుడు కావడంతో శిఖర్ ధావన్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను వెంటనే యాక్సెప్ట్ చేసింది అయేషా. అలా ఫేస్బుక్ ఛాటింగ్ ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకు స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. (Instagram)
అయేషా ముఖర్జీ వివాహం, విడాకులు, పిల్లల గురించి పూర్తిగా తెలుసుకున్న శిఖర్ ధావన్, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ పెళ్లికి శిఖర్ ధావన్ కుటుంబీకులు అంగీకరించలేదు.మరీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... శిఖర్ ధావన్ కంటే అయేషా ముఖర్జీ వయసులో ఏకంగా 10 ఏళ్లు పెద్దది కూడా. ధావన్ ప్రేమకి అతని కుటుంబంలో ఎవ్వరూ అంగీకరించకపోయినా, అతని తల్లి మాత్రం కొడుకు ప్రేమను అర్థం చేసుకుంది. (Instagram)
2009లోనే అయేషా ముఖర్జీ గురించి ఇంట్లోవాళ్లతో గొడవపడి బయటికి వచ్చేసిన శిఖర్ ధావన్, 2012లో ఆమెను పెళ్లాడాడు. ధావన్‌ను పెళ్లాడడానికి అయేషా పెట్టిన ఒకే ఒక కండీషన్, తన కూతుళ్లు తనతోనే ఉంటారని. ఆ తర్వాత 2014లో అయేషా, ధావన్‌లకు కొడుకు జన్మించాడు. అయితే ప్రస్తుతం చదువుల కోసం అయేషా కూతుర్లు ఆస్ట్రేలియా అమ్మమ్మవారితో ఉంటుండగా కొడుకు జోహరా మాత్రం ఇక్కడే ఉన్నాడు. (Instagram)
వ్యక్తిగతంగా, తన కెరీర్ ఎదుగుదలలో ఆయేషా పాత్ర ఎంతో ఉందంటూ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించిన ధావన్ తమ అన్యోన్యతను ప్రదర్శిస్తూ వచ్చాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోయి దురదృష్టవశాత్తూ విడిపోయే పరిస్థితి వచ్చింది. జీవితంలో రెండోసారి తాను విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయేషా తన ఆవేదనను వ్యక్తం చేసింది. (Instagram)
మరోవైపు, శిఖర్ ధావన్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ గా వైరల్ గా మారుతోంది. " మీ డ్రీమ్ సాధించడానికి మీరెంతో కష్టపడాలి. మనం చేసే పని పట్ల ప్రేమ ఉండాలి. అలా ఉంటనే అసలు సిసలు ఎంజాయ్ అంటో ఎంటో తెలుస్తోంది. మీ కలలు సాకారం కావాలంటే.. కష్టపడండి" అంటూ ఇన్ స్టా వేదికగా శిఖర్ ధావన్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.(Instagram)