టోక్యో ఒలింపిక్స్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడని విశ్వ క్రీడలు ఎట్టకేలకు మొదలు కాబోతున్నాయి. ప్రతీ ఈవెంట్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు అందజేస్తారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పతకాలను రూపొందించిన డిజైనర్ ఎవరు? అందులో వాడిన లోహాల ఆధారంగా మార్కెట్ విలువ ఎంతుంటుంతో తెలుసుకుందాం. (Olympics)
ప్రతీ మెడల్ రాతి నుంచి చెక్కబడినట్లుగా అనిపిస్తుంది. అంత ధృఢంగా రూపొందించారు. అంతే కాకుండా పూర్తిగా పాలిష్ చేయబడి ఉండటంతో మెరుస్తూ ఉంటుంది. ప్రతీ మెడల్ ముందు భాగంలో గ్రీకు విజయ దేవత 'నైకి' బొమ్మ చెక్కబడింది. ఆమె ఏథెన్సులోని పనథినైకోస్ స్టేడియం ముందు నిలబడి ఉంటుంది. ఇక వెనుక భాగంలో టోక్యో 2020 లోగోను చెక్కారు. (Olympics)