" ఇందులో దాచిపెట్టే విషయం అంతగా ఏం లేదు. భారత జట్టు పగ్గాలు అందుకునే రేసులో రోహిత్ శర్మ ఖచ్చితంగా ముందుంటాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడు. ప్రపంచకప్ అనంతరం అధికారిక ప్రకటన ఉంటుంది" అని ఆ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న రోహిత్ ఫాన్స్ ఆనందంలో తెలియాడుతున్నారు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మకు కెప్టెన్గా తిరుగులేని రికార్డు ఉంది. ముంబై ఇండియన్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న రోహిత్.. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ లీగ్ టీ20లో కూడా రెండు సార్లు ట్రోఫీ ముంబైకి కప్ అందించాడు. ఐపీఎల్ టోర్నీలో అత్యధిక ట్రోఫీలు అందించిన అందించిన కెప్టెన్ రోహిత్ మాత్రమే.
మరోవైపు ఆర్సీబీ టీమ్మేనేజ్మెంట్ కూడా అసలు సిసలు కెప్టెన్ కోసం వేట మొదలుపెట్టింది. విరాట్ కోహ్లీ వారుసుడిగా ఆర్సీబీ కెప్టెన్ రేసులో ఓ నలుగురు ప్లేయర్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్ పేర్లు ప్రముఖంగా ఈ లిస్ట్ లో ఉన్నాయ్. గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది.