ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ ఒకడనే విషయం అందరికీ తెలిసిందే. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన కెరీర్ రికార్డు కలిగిన విరాట్ కోహ్లీ ఈ మధ్య ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడుతున్నాడు. పదే పదే ఒకే బౌలర్ చేతికి చిక్కి పెవీలియన్ చేరుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో విరాట్ తడబడటం చూశాం. కాగా, విరాట్ కెరీర్ చూస్తే.. కొంత మంది బౌలర్లకు వరుసగా లొంగిపోతున్నాడు. వీరిలో ఎక్కువ మంది ఇంగ్లాండ్ బౌలర్లే కావడం విశేషం. మరి ఆ టాప్ సిక్స్ బౌలర్లు ఎవరో చూద్దాం. (PC: BCCI)