మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) క్రికెట్ ప్రపంచలోకి పరిచయం అక్కర్లేని పేరు. ఎంతో మంది సీనియర్లకు రాని పేరు, సంపాదని 20 ఏళ్లకే సచిన్ సొంతమయ్యాయి. సచిన్ ఆడుతుంటే కోట్లాది మంది అభిమానులు కళ్లప్పగించి చూస్తుండే వాళ్లు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ అంజలి. సచిన్ అంటే ఆమెకు విపరీతమైన అభిమానం.
"నన్ను సచిన్‌ను తొలిసారి చూసినప్పుడు అతనికి 17 ఏళ్లు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని విమానాశ్రయం చేరుకున్నాడు. అదే సమయంలో మా అమ్మను రిసీవ్ చేసుకోవడానికి నేను అక్కడికి వెళ్లాను. ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకున్నాం. నన్ను చూసిన మరుక్షణమే పెళ్లి చేసుకోవాలని సచిన్ అనుకున్నాడట. కానీ, సచిన్ ఎవరు? ఏం చేస్తాడనే విషయాలు నాకప్పటికి తెలీదు. కొంతకాలం తర్వాత మేం ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నాం.
మా పరిచయం బలపడిన తర్వాత అతనితో మాట్లాడటానికి ఇప్పటి మాదిరిగా ఆ కాలంలో మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా లేదు. అందువల్ల అతనితో మాట్లాడటానికి 48 ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లేదాన్ని. ఎక్కువ సమయం మాట్లాడటంతో బిల్లు కూడా ఎక్కువగా వచ్చేది. టెలిఫోన్ బిల్లులను ఆదా చేయడానికి ప్రేమ లేఖలతో సంభాషించుకునేవాళ్లం. జర్నలిస్టుగా నటించాలని, అలా నన్ను వారి కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని చెప్పాడు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్న జర్నలిస్టుగా నన్ను సచిన్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ఈ సమయంలో సచిన్ కాస్త భయపడ్డాడు. సల్వార్ కమీజ్ ధరించి మొదటిసారి ఆయన ఇంటికి వెళ్లా" అని అంజలి చెప్పుకొచ్చారు.