డెహ్రాడూన్‌లోని 'అభిమన్యు క్రికెట్ అకాడమీ స్టేడియం'.. ఉత్తరాఖండ్ వర్సెస్ బెంగాల్ రంజీ మ్యాచ్ కు వేదికైంది. అయితే.. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా..? అసలు విషయం ఇక్కడే ఉంది. జాతీయ జట్టులో స్థానం కోసం గట్టి పోటీ దారుగా ఉన్న భారత క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్, తన పేరుతో నిర్మించిన స్టేడియంలో మ్యాచ్ ఆడి అరుదైన ఫీట్ సాధించాడు. (Abhimanyu Easwaran/Instagram)
అభిమన్యు పేరు మీద ఈ స్టేడియాన్ని తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ నిర్మించాడు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ అయిన అతను.. అభిమన్యు (1995) పుట్టకముందే 1988లో ‘అభిమన్యు క్రికెట్ అకాడమీ’ ఏర్పాటు చేశాడు. 2005లో సొంతడబ్బుతో స్థలం కొని, ఆ తర్వాతి ఏడాది స్టేడియం నిర్మాణం మొదలెట్టాడు. అత్యాధునిక వసతులతో ఉన్న ఈ స్టేడియంలో టీమిండియా క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ చేశారు.(Abhimanyu Easwaran/Instagram)
రిటైర్మెంట్ తర్వాత స్టేడియాలకు వెటరన్ క్రికెటర్ల పేర్లను పెట్టడం కొత్త విషయం కాదు.వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ పేరిట అంటీఘాలో ఓ క్రికెట్ స్టేడియం ఉంది. అలాగే బ్రియాన్ లారా పేరుతలో ట్రిడినాడ్ అండ్ టొబాగోలో స్టేడియాన్ని నిర్మించారు.. బ్రిస్బేన్‌లో ఆలెన్ బోర్డర్ పేరుతో క్రికెట్ స్టేడియం ఉంది. అయితే ఈ క్రికెటర్లు అందరూ క్రికెట్లో ఎంతో సాధించి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక... క్రికెట్ ఫీల్డ్‌లో వాళ్లు సాధించిన ఘనతలకు గుర్తింపుగా గౌరవంగా స్టేడియాలకు వారి పేర్లను పెట్టారు. (Abhimanyu Easwaran/Instagram)
కానీ ఇంకా దేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఆటగాడి పేరుతో స్టేడియం ఉంటుందని.. అందులో ఇప్పుడా క్రికెటర్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడే అభిమన్యు ఈ శ్వరన్. ఈ సందర్భంలో అభిమన్యు 'అభిమన్యు స్టేడియం'లో ఆడటం నిజంగా తండ్రీ కొడుకులిద్దరికీ ప్రత్యేకమైన సందర్భం. ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి.(Abhimanyu Easwaran/Instagram)
అభిమన్యు కూడా ఇక్కడే శిక్షణ పొంది ఆటలో రాటుదేలాడు. ఫ్లడ్‌లైట్లు కూడా ఉన్న ఈ స్టేడియాన్ని దేశవాళీ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ తీసుకుంది. " క్రికెట్ నేర్చుకున్న చోటే రంజీ మ్యాచ్ ఆడబోతుండడం గర్వంగా ఉంది. ఆటపై నా తండ్రికి ఉన్న ప్రేమకు, ఆయన కృషికి ఇది నిదర్శనం. స్వస్థలానికి రావడం ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. కానీ ఒక్కసారి మైదానంలో అడుగుపెడితే బెంగాల్ విజయంపైనే దృష్టి పెడతా" అని అభిమన్యు చెప్పాడు. (Abhimanyu Easwaran/Instagram)
" స్టేడియం యజమానే అందులో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ ఇది నాకు ఘనతేమీ కాదు. నా తనయుడు దేశానికి వంద టెస్టులు ఆడితేనే గొప్పగా ఉంటుంది " అని అభిమన్యు తండ్రి రంగనాథన్ పేర్కొన్నారు. ఇప్పటిదాకా 70 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన అభిమన్యు ఈశ్వరన్, 15 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో 4841 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పర్యటనలో టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. కానీ, తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. (Abhimanyu Easwaran/Instagram)