WATCH SANIA MIRZA AND SHOAIB MALIK CELEBRATED HER BIRTHDAY WITH NEWBORN SON IZHAAN
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట్లో సంతోషాల సంబరాలు...
భారతీయ అమ్మాయిలు క్రీడారంగంలోకి అడుగుపెట్టడానికి మార్గదర్శిగా మారిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా. టెన్నిస్‌లో అనితర సాధ్యమైన విజయాలు సాధించి, స్టార్ స్టేటస్ సంపాదించిన సానియా మీర్జా ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఇండియా తరుపున ప్రాతినిథ్యం వహించిన సానియా... తానెప్పుడూ భారతీయురాలినే అని చెప్పుకోవడానకి గర్విస్తానని చెప్పింది. సరిగ్గా 16 రోజుల క్రితం ఓ పిల్లాడికి జన్మనిచ్చిన సానియా మీర్జా... గురువారం 32వ వడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సానియా మీర్జా ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు.
తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ షోయబ్ మాలిక్ పోస్ట్ చేసిన ఫోటో... ‘వేడుకల సమయం నా భార్య తల్లై 16 రోజులు... ఇప్పుడు తను 16 ఏళ్ల అమ్మాయిలా మారిపోయింది... మా అత్తగారు సానియాకే పోటీ ఇస్తున్నారు’ అంటూ పోస్ట్ చేశాడు మాలిక్. (Photo: Instagram)
2/ 5
సానియా మీర్జా పోస్ట్ చేసిన ఫోటో... భర్త షోయబ్ మాలిక్, చెల్లెలు అనమ్ మీర్జా ముద్దుపెడుతున్న సీన్ (Photo: Instagram)
3/ 5
పుట్టినరోజు వేడుకల తర్వాత సానియా మీర్జా పోస్ట్ చేసిన ఫోటో... ‘నా పుట్టినరోజును మధురంగా మార్చిన అందరికీ ధన్యవాదాలు..’ అంటూ కామెంట్ చేసింది సానియా... (Photo: Instagram)
4/ 5
కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తండ్రి ఇమ్రాన్ మీర్జా పోస్ట్ చేసిన ఫోటో... (Photo: Instagram)
5/ 5
జెర్సీ వేసుకుని ఫోటోకి ఫోజ్ ఇవ్వడంటూ సవాల్ విసురుతూ సానియా మీర్జా పోస్ట్ చేసిన ఫోటో (Photo: Instagram)