ఇండియాలో క్రికెట్‌కు చాలా క్రేజ్ ఉంది. ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ మార్కెట్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోయింది. దీన్ని స్పూర్తిగా తీసుకొని.. ఎన్నో ఏళ్లుగా ఇండియాలో పాపులర్ అయిన గ్రామీణ క్రీడ కబడ్డీని ప్రమోట్ చేయాలని భావించారు. మాషల్ స్పోర్ట్స్ అనే సంస్థ ఈ ప్రో కబడ్డీ లీగ్‌ను రూపొందించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 74 శాతం వాటా స్టార్ స్పోర్ట్స్ దగ్గరే ఉన్నది. 2014లో తొలి పీకేఎల్ సీజన్ ప్రారంభమైంది. అప్పట్లో కేవలం 8 జట్లతో ప్రారంభమైన పీకేఎల్.. ప్రస్తుతం 12 జట్లకు చేరుకున్నది. ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకున్నది. 2020లో జరగాల్సిన 8వ సీజన్ కరోనా కారణంగా వాయిదా వేశారు. తాజాగా 8వ సీజన్‌ను డిసెంబర్ 22 నుంచి ప్రారంభించనున్నారు. అయితే ఈ కబడ్డీ లీగ్‌లో ఉన్న జట్లు ఏమిటి? వాటి యజమానులు ఎవరో ఒకసారి చూద్దాం. (PC: PKL)